Site icon vidhaatha

బక్క జడ్సన్‌కు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నోటీసులు


విధాత : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌కు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై సామజిక మాధ్యమాల్లో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ నోటీస్‌లు జారీ చేశారు. నోటీస్‌లకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. నోటీస్‌లపై జడ్సన్‌ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version