Site icon vidhaatha

గ్రేటర్ వరంగల్‌పై కాంగ్రెస్ పట్టు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ పట్టు సాధించింది. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ, మురళి అమలు చేస్తున్న ఆపరేషన్‌కు గాంధీ భవన్ చేరికలు ముగింపునిచ్చాయి. బుధవారం గాంధీ భవన్‌లో మంత్రి కొండా సురేఖ సమక్షంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు చెందిన 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నలుగురు మాజీ కార్పొరేటర్లు, 12 డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 21 డివిజన్ కార్పొరేటర్‌ ఎండీ పుర్కాన్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ (38), కావటి కవిత (12), వస్కుల బాబు(18), ఓని భాస్కర్(19), బస్వరాజు కుమార్(22), ఆకుతోట తేజస్విని శిరీష్(24), చింతాకుల అనిల్(27), ముష్కమల్ల అరుణ సుధాకర్(33), పోశాల పద్మ స్వామి గౌడ్(41), సురేష్ జోషి(13); మాజీ కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్, జారతి రమేష్, నాగపూరి కల్పన సంజయ్, మేడిది రజిత మధు, బీఆర్ఎస్ 12 డివిజన్ల అధ్యక్షులు, గౌడ సొసైటీ చైర్మన్‌ మంద శ్యామ్, సీనియర్ నాయకులు తోట హరీష్, ఐనవోలు ఎంపీటీసీ శంకర్ రెడ్డి, హసన్ పర్తి ఎంపీపీ సునీతా రాజు తదితరులున్నారు. రాబోయే రోజుల్లో మరికొందరు కార్పొరేటర్లు, ఇతర నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిణామంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి నెలకొంది.

Exit mobile version