- కేరళలోని వయనాడ్‌లో ఉద్రిక్తత
- దేశంలో ఎక్కడికక్కకడ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్, ప్రియాంకలు
విధాత: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. రాహుల్ సొంత నియోజకవర్గం వయనాడ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రాహుల్‌పైప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని నిరసిస్తూ కేరళ రాష్ట్రంలోని రాహుల్ సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
పెద్ద ఎత్తున కదలి వచ్చిన కార్యకర్తలతో చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలను బలవతంగా వ్యాన్‌లలోకి ఎక్కించి పోలీస్టేషన్లకు తరలించారు.
అలాగే చత్తీస్‌గడ్ రాజధాని రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించిన నిరసన ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు నల్లజెండాలు చేతబట్టి నిరసన ప్రదర్శన చేశారు. ముషీరాబాద్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్రమోడీ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.
కాగా దేశ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పరిశీలించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హుటా హుటిన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అతి కొద్ది సేపట్లో రాహుల్, ప్రియాంకలు మీడియాతో మాట్లాడుతున్నారు.
వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై బహిష్కరణ వేటు వేసినందుకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. ములుగు జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో రాస్తారోకో ధర్నాలు నిర్వహించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
గోవిందరావుపేట మండల కేంద్రంలోని రహదారి పైన ధర్నా నిర్వహించి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు నిరసనగా వెంకటాపూర్ తాళ్ళ పాడు సెంటర్ ధర్నా రాస్తో రోకో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరిత తీర్పుకు వ్యతిరేకంగా ధర్నా రాస్తారోకో చేసి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరి కష్టాలను తెలుసుకుంటూ, ప్రజలకు దగ్గరయి ఎనలేని కీర్తిని గడించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతో అక్రమకేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నొజు సూర్య నారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు విరేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మైస ప్రభాకర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు బుస సాంబయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్యూ.
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.