Congress | హామీల అమలులో కేసీఆర్ విఫలం: దశాబ్ది దగా నిరసనలో పద్మావతి ఉత్తమ్

Congress విధాత: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దగా చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఇందిరా సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అక్కడ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ […]

  • Publish Date - June 22, 2023 / 01:43 PM IST

Congress

విధాత: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దగా చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఇందిరా సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అక్కడ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, తమ స్వంత పార్టీ ప్రచారం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దశాబ్ది దగా పేరుతో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ నిరసనను వ్యక్తం చేసిందన్నారు.

ప్రభుత్వం గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేయలేదని, ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం రాలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు.

దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఊసే లేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వనే లేదన్నారు. రైతు రుణ మాఫీ అమలు కాలేదన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, 12 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు.

Latest News