విధాత: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ (MLA Gadari Kishore) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు కిషోర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.