Site icon vidhaatha

Nalgonda Congress | రసాభాసగా నల్గొండలో కాంగ్రెస్ నిరసన దీక్ష

విధాత, రాహుల్ గాంధీ పై అనర్హత వేటును నిరసిస్తూ నల్గొండలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్ష కాంగ్రెస్ వర్గాల మధ్య రభసకు వేదికైంది. నల్గొండ గడియారం సెంటర్లో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు నిరసన దీక్ష చేపట్టారు. మధ్యాహ్న సమయంలో పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ గౌడ్ నిరసన దీక్ష శిబిరానికి వచ్చారు.

చెరుకు సుధాకర్ గౌడ్ ప్రసంగిస్తున్న క్రమంలో కోమటిరెడ్డి వర్గీయులు కోమటిరెడ్డి నాయకత్వం వర్డిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పోటాపోటీ నినాదాలు, వాగ్వివాదంతో రసాభాస నెలకొంది. రెండువర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారగా అర్దాంతరంగా నిరసన దీక్ష ముగించేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

దీక్షా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, తండు సైదులు గౌడ్, ఎంపిపి సుమన్, వైస్ ఎంపీపీ జిల్లల పరమేష్, స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version