- తక్కువ టైం ఎక్కువ సెగ్మెంట్లూ
- సెగ్మెంట్ సెంటర్లో కార్నర్ మీటింగ్
- అధికార పార్టీ ఎమ్మెల్యేలు టార్గెట్
- కాంగ్రెస్ శ్రేణుల్లో చలనం ప్రారంభం
- అశావహుల మధ్య అనివార్యపోటీ
- తన వర్గం బలోపేతానికి వ్యూహం
- యాత్రతో సానుకూల ఫలితాలు
రానున్న రోజుల్లో అధికారమే (Power)లక్ష్యంగా పాలక గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో తన వర్గం బలోపేతం చేసుకుంటూ.. టీపీసీసీ అధ్యక్షుడ(Tpcc president) రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన ఎత్తుగడలు ఫలించి సానుకూల ఫలితాలు ప్రారంభమైనట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అక్కడక్కడ అడ్డంకులు ఎదురైనా, ఎక్కువగా అనుకూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో మరింత ఉత్సాహంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. షార్ట్ కట్ సక్సెస్‌ఫుల్ ఫార్ములా (Shortcut & succes full formula) అనే థియరీని అమలు చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో కార్నర్ మీటింగ్‌లు పెట్టి పార్టీలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక్కో నియోజకవర్గంలో ఒకరోజు యాత్ర నిర్వహిస్తూ.. ఆ సెగ్మెంట్‌లోని రెండు, మూడు మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా పర్యటిస్తూ.. వారి సాధకబాధకాలను తెలుసుకుంటూ.. రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం మించకుండా.. ఆ సెగ్మెంట్ (Segment)లోని అన్ని మండలాల పార్టీ శ్రేణులు నియోజకవర్గ కేంద్రలో సాయంత్రం జరిగే కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యే విధంగా రేవంత్ రెడ్డి యాత్ర కార్యాచరణ కొనసాగుతున్నది.
ఆ నియోజకవర్గం పై ప్రభావం ఉండే విధంగా మార్పు కోసం యాత్ర (yatra for change) అనే ట్యాగ్ లైన్‌తో సాగుతోంది. మధ్యమధ్య నియోజకవర్గాల మధ్య జంప్ ( jump)చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఆశిస్తున్నారు. ఈ విధంగా ప్రత్యర్థుల్లో చర్చను రేపుతున్నారు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో సాగుతున్నారు. ఆశలు సన్నగిల్లిన కాంగ్రెస్ పోటీదారులకు అభయాస్తం ఇస్తూ వారి మధ్య పోటీని పెంచుతున్నారు.
- పట్టు పెంచుకోవడమే లక్ష్యం (Target)
అధికార గులాబీ పార్టీ లక్ష్యంగా సొంత పార్టీలో పట్టు సాధించే ప్రణాళికతో రేవంత్ తొలి విడత హాత్‌సే హాత్‌జోడో యాత్ర సాగుతోంది. అటు పార్టీలోని అసమ్మతి వర్గాలకు, ఇటు ఇతర పక్షాల్లో తగిన చర్చ జరిగే విధంగా సక్సెస్‌ఫుల్ ప్రణాళికతో రేవంత్ వర్గం ముందుకు సాగుతోంది. తొలివిడత 50 నియోజకవర్గాలలో 60 రోజులపాటు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటివరకు పది నియోజకవర్గాలలో యాత్ర పూర్తయింది. ఈ నెల 6వ తేదీన మేడారంలో ప్రారంభించిన యాత్ర 12 వ రోజు సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో యాత్ర సాగుతోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు ఉన్న పునాదులను ఆసరా చేసుకొని వచ్చే ఎన్నికల్లో (Elections)గెలుపే లక్ష్యంగా యాత్ర కొనసాగిస్తున్నారు. యాత్ర ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమైక్యతను (unity)సృష్టించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
- ఎమ్మెల్యేలపై రేవంత్ ఫైర్
గులాబీ ఎమ్మెల్యే, ఎంపీలపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ హీటు పెంచే మాటలతూటాలు సంధిస్తున్నారు. పేదల భూములు గుంజుకుంటూ భూకబ్జాలకు (land grabbing) పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ ఎక్కడ చూసినా గులాబీ లీడర్ల అక్రమాలు అన్యాయాలు రాజ్యమేలుతున్నాయంటూ విరుచుకబడ్డారు. ఈ మేరకు అధికారపార్టీ ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ నాయకులు సైతం తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు.
- ప్రజా సమస్యల ప్రస్తావన
ఎన్నికలు త్వరలో రానున్నందున పాలక గులాబీ పక్షానికి దీటుగా కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే యాత్రకు ముందు అడ్డంకులు ఎదురైనా ప్రారభించారు. ఇప్పటికే స్థానిక సమస్యలను నియోజకవర్గాల్లో జరిగే కార్నర్ మీటింగ్ లలో (corner meeting’s)ప్రస్థావించాల్సిన సమస్యల పై పార్టీ నుంచి సమాచారం సేకరించి మేరకు ప్రసంగాలు ఉంటున్నాయి. గిరిజనుల ఇబ్బందులు, పోడు భూముల సమస్య, రైతుల సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ (BRS) నాయకులు, ప్రజాప్రతినిధుల అక్రమాలను విమర్శిస్తున్నారు.
కాగా.. తాను యాత్ర చేపట్టే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన అనుకూల ప్రత్యేక బృందాల ద్వారా ముందుగా సమాచారం తెప్పించుకుంటున్నారు. యాత్ర ఏర్పాట్లను చూసుకునే పనిలో ఆశావహులు, పార్టీ కమిటీలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే యాత్ర పూర్తిచేసిన ప్రాంతాల్లో జోష్ నింపినందున అధికారం పైన ఆశతో కాంగ్రెస్(congress) శ్రేణులున్నాయి. ఈ మేరకు యాత్రతో ఆశాజనకమైన ఫలితాలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.