Site icon vidhaatha

యూపీలో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్.. మూడు రోజుల్లో 244 మంది అరెస్టు


విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో అక్ర‌మ మార్గాల్లో ఉద్యోగాలు పొందేందుకు కుట్ర ప‌న్నిన కేసులో మూడు రోజుల్లోనే 244 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వ‌ర‌కు లక్నోలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ అరెస్టులు జ‌రిగాయి. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫిబ్రవరి 17 , 18 తేదీల్లో నిర్వ‌హించారు. స్థానిక ఇంటెలిజెన్స్ స‌హ‌కారంతో జిల్లా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్‌) యూనిట్లు ఈ అరెస్టులు చేశాయి.


“అరెస్టయిన లేదా అదుపులోకి తీసుకున్న నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంత‌రం వారిని పోలీసులు అదికారులు విచారిస్తున్నారు. అన్యాయమైన మార్గాలను (పరీక్షలలో) అవలంబించే వ్యక్తులు, ముఠాలను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


“అన్యాయమైన మార్గాలను అవలంబించి ప‌రీక్ష‌లో అత్య‌ధిక మార్కులు సాధించి ఉద్యోగాలు సాధించాల‌నే నిందితుల దుర్మార్గపు ప్రణాళికలను అమలు చేయడానికి ముందే చాలా అరెస్టులు జరిగాయి” అని ఆయన చెప్పారు.

Exit mobile version