ప్రీతి ప్రాణం ఖరీదు రూ.10 లక్షలు.. ప్రభుత్వం తీరుపై ప్రజల్లో విస్మయం

విధాత‌: ఒక్కోసారి, కొన్ని విషయాల్లో కేసీఆర్ సర్కారు వ్యవహరించే స్థాయి, తీరు చూస్తుంటే ప్రజలకు నిర్వేదం, ఓ టైప్ చిరాకు కలుగుతుంది. ఒక్కోసారి కొన్న్ని సంఘటనల్లో అతిగా స్పందించడం, కొన్నింటిని పూర్తిగా విస్మరించడం చూస్తున్నారు. కొండగట్టులో బస్సుప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగినా కేసీఆర్ కనీసం స్పందించలేదు.. ఇలాగే పలు అంశాల మీద పట్టీ పట్టనట్లు ఉంటారు. కానీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్యాయత్నం, ఆ తరువాత మరణించడం, తదనంతర పరిణామాల పట్ల […]

  • Publish Date - February 27, 2023 / 09:47 AM IST

విధాత‌: ఒక్కోసారి, కొన్ని విషయాల్లో కేసీఆర్ సర్కారు వ్యవహరించే స్థాయి, తీరు చూస్తుంటే ప్రజలకు నిర్వేదం, ఓ టైప్ చిరాకు కలుగుతుంది. ఒక్కోసారి కొన్న్ని సంఘటనల్లో అతిగా స్పందించడం, కొన్నింటిని పూర్తిగా విస్మరించడం చూస్తున్నారు.

కొండగట్టులో బస్సుప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగినా కేసీఆర్ కనీసం స్పందించలేదు.. ఇలాగే పలు అంశాల మీద పట్టీ పట్టనట్లు ఉంటారు. కానీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్యాయత్నం, ఆ తరువాత మరణించడం, తదనంతర పరిణామాల పట్ల కేసీఆర్ స్పందించిన తీరును ప్రజలు సైతం అసహ్యించుకుంటున్నారు.

దేనికీ స్పందించ‌ని స‌ర్కారు

కాలేజీలో సైఫ్ అనే సీనియర్ విద్యార్థి అదేపనిగా వేధించడం, తరువాత ఆమె తండ్రి పోలీసులకు, కాలేజీ విభాగాధిపతికి ఫిర్యాదు చేయడం.. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం.. తరువాత ప్రీతి తన కష్టాన్ని తల్లికి చెప్పుకోవడం, మరునాడు విషపు ఇంజక్షన్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించి నాలుగు రోజులుగా పోరాడి ప్రాణాలు విడవడం.. ఇదంతా దేశం యావత్తూ చూసింది.

సైఫ్ తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. గిరిజన సంఘాలు కూడా ఏకమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఇంకా సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి, అయినా సర్కారు స్పందించలేదు.

ప్రీతి మరణం తరువాత జస్ట్ రూ.10 లక్షల పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించటంపై ఒకింత విస్మయం వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతానికి భారీగా పరిహారాన్ని ప్రకటిస్తారని భావించారు.

ప్ర‌భుత్వ తీరుపై బంజార నేత‌ల ఆగ్ర‌హం

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమను మరింత బాధకు గురి చేసినట్లుగా బంజారా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా పీజీ వైద్య విద్యార్థిని ప్రాణాల్ని తీశారని.. ఇలాంటి దుర్మార్గ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాగోలేదన్న మాట వినిపించింది.

ఇంకో విషయం ఏమంటే.. ప్రీతి మరణంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన తరఫు నుంచి రూ.20లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఇంకా పంచాయతీరాజ్ శాఖలో ఒక ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు.

గిరిజన వర్గాల్లో నిరసన

ఇక ఇక్కడ ఆమెకు జస్ట్ రూ.పది లక్షలు ప్రకటించడం మీద కాదు కానీ ఆమె మరణం, దానికి ముందు కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ ఇవన్నీ కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజల్ని విస్మయానికి గురి చేసింది. ఒక గిరిజన బిడ్డ ఉన్నత చదువులు చదవడాన్ని సమాజం సహించ లేకపోయింది. ర్యాగింగ్ చేసి చంపేసింది అన్నట్లుగా ప్రజల్లో, ముఖ్యంగా గిరిజన వర్గాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తరఫున, పెద్దలు ఎవరైనా ఓ ఊరడింపు మాట చెప్పడానికి నోరు రాలేదా అనే విమర్శలు వస్తున్నాయి.

Latest News