Site icon vidhaatha

Air India Express | యూఏఈ నుంచి వస్తే.. ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే..!

Air India Express : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని ఎయిర్‌ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆదేశించింది. ఈ మేరకు ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అరబ్‌ దేశాల నుంచి తమ విమానాల్లో భారత్‌కు వచ్చేవారంతా షెడ్యూల్‌ ప్రకారం కొవిడ్‌ టీకా తీసుకోవాల్సిందేనని చెప్పింది. అలాగే మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పింది.

అయితే, 12 సంవత్సరాల్లోపు చిన్నారులకు మినహాయింపునిచ్చింది. చిన్నారులు ప్రయాణానికి ముందు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొవిడ్‌ లక్షణాలుంటే తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. భారత్‌ తొలి మొదటి అంతర్జాతీయ బడ్జెట్‌ క్యారియర్‌ అయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌.. కేరళలోని కొచ్చి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. మధ్యప్రాశ్చ్య, ఆగ్రేయాసియా దేశాలకు విమానాలు నడిపిస్తున్నది.

Exit mobile version