Site icon vidhaatha

Cow Clone | గిర్‌జాతి ఆవును క్లోన్‌ చేసిన NDRI.. ఇక పాల ఉత్పత్తిలో సరికొత్త విప్లవం..!

Cow Clone | జంతు క్లోనింగ్‌ రంగంలో నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో గిర్‌జాతి ఆవును క్లోన్‌ చేసింది. క్లోన్‌ చేసిన ఆవుకు గంగా నామకరణం చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ICAR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ తెలిపారు. వాతావరణ మార్పుల మధ్య పాల ఉత్పత్తిలో ఇదో విప్లవమని పేర్కొన్నారు.

కర్నాల్‌ నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2009లో గేదెల క్లోన్డ్‌ డిగ్నిటీని తయారు చేయడంలో విజయవంతమైంది. పాల ఉత్పత్తికి వాతావరణ మార్పుల మధ్య తీవ్రమైన వేడి, విపరీతమైన చలిని తట్టుకోగల జాతులు అవసరం.

ఎన్‌డీఆర్‌ఐ డాక్టర్‌ ధీర్‌ సింగ్‌ మాట్లాడుతూ నేడు దేశీయ ఆవుల ఉత్పాదకత భారతదేశంలో స్థిరమైన పాల ఉత్పత్తికి పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఈ దిశలో 2021లో ఉత్తరాఖండ్‌ లైవ్‌స్టాక్‌ డెలవప్‌మెంట్‌ బోర్డ్‌, గిర్‌, సాహివాల్‌, రెడ్‌ సింధీ వంటి దేశవాలీ ఆవులను క్లోనింగ్‌ చేసే పనులను కర్నాల్‌ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరీ ప్రారంభించిందని పేర్కొన్నారు.

గిర్‌జాతి ఆవులు గురించి..

గిర్‌జాతి ఆవులు గుజరాత్ రాష్ట్రంలోని కథియావత్ ప్రాంతంలోని గిర్ అడువులకు చెందినవి. చూసేందుకు బాగుండడంతో పాటు శారీరం సైజు మధ్యస్తంగా ఉంటుంది. ఇవి సాధారణంగా సాదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. తల పొడవుగా ఉండి.. వెనుక ప్రాంతం నిలువుగా, సమాంతరంగా ఉండడం గిర్ జాతి ఆవుల లక్షణం.

ఆవులు సగటున 386 కిలోలు, గిర్‌జాతి ఎడ్లు 546 కిలోల వరకు బరువుంటాయి. తెలుపు, ఎరుపు, చాక్లెట్, బ్రౌన్, కొన్ని సందర్భాలలో నలుపు మచ్చలను శరీరంపై కలిగి ఉంటాయి. ఈ ఆవులు పాడి కాలంలో 3182 కిలోల పాల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. మొదటి దూడను వేయడానికి 51 నెలల సమయం పడుతుంది. గిర్ ఎద్దులను ఇతర స్వదేశి ఆవులపై ప్రయోగించి మేవతి, డియోని, నిమారి అనే జాతులను సైతం దేశంలో అభివృద్ధి చేశారు.

Exit mobile version