Site icon vidhaatha

Viral Video | బ‌ట్ట‌ల దుకాణంలో ఆవు హల్‌చ‌ల్‌

Viral Video | అడ‌వులు, వ్య‌వ‌సాయ పొలాలు, వీధుల్లో ద‌ర్శ‌న‌మిచ్చే ఆవులు ఇటీవ‌లి కాలంలో అక్క‌డ‌క్క‌డ ఆస్ప‌త్రుల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఆవు బ‌ట్ట‌ల దుకాణంలోకి వెళ్లి హ‌ల్‌చ‌ల్ చేసింది. దుకాణం ముందు ప్ర‌దర్శించే బొమ్మ‌ల‌ను చూసి, అవేవో జంతువులు అనుకున్న‌ట్టుంది ఆవు.

ఇంకేముంది ఆవు లోప‌లికి ప్ర‌వేశించి.. షాపు మొత్తం తిరిగింది. దీంతో భ‌యంతో సిబ్బంది, క‌స్ట‌మ‌ర్లు ప‌రుగులు తీశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అస్సాం (Assam)లోని దుబ్రి (Dhubri) ప్రాంతంలో గల ఓ బట్టల దుకాణంలోకి ఆవు ప్రవేశించింది. అటూ ఇటూ తిరుగుతూ.. షోరూమ్ మొత్తం ఓ రౌండ్‌ వేసేసింది. అనంతరం దానంతట అదే బయటకు వెళ్లిపోయింది.

ఇది గమనించిన దుకాణ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన డిసెంబర్‌ చివరి వారంలో జరగ్గా.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version