Site icon vidhaatha

Road Accident | బస్సు ఢీ.. 14 ఆవులు మృతి

విధాత: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గ బావి గూడెం సమీపంలో అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో 14 ఆవులు మృతి చెందాయి. చెన్నై నుండి హైదరాబాద్ వెళుతున్న భారతీ ట్రావెల్ బస్సు రోడ్డు దాటుతున్న ఆవుల మందను ఢీకొనడంతో 14 ఆవులు రోడ్డుపైనే అక్కడికక్కడే మృతి చెందాయి.

దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన పశువుల యాజమానులు పెద్ద గొల్ల పుల్లయ్య, రామావత్ రాము నాయక్, కేతావత్ బిక్కు నాయక్ లు తమ 16 పశువులను తోలుకొని మూసి ప్రాజెక్టు ఆయకట్టుకు మేత కోసం వలస వెళ్తున్నారు.

తెల్లవారుజామున ఆవుల మంద తో రోడ్డు దాటుతున్న క్రమంలో భారతీ ట్రావెల్ బస్సు ఆవులను ఢీ కొట్టింది. ప్రమాదంలో 14 ఆవులు చనిపోయాయ. సుమారు గా ఎనిమిది లక్షల నష్టం వాటిల్లినట్లుగా పశువుల యజమానులు వాపోయారు. ప్రమాద ప్రాంతం మాడ్గుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version