Horoscope | ఈ రోజు రాశి ఫ‌లాలు(07-07-2023).. ఈ రాశి వారికి ధ‌న‌ లాభం..!

Horoscope | మేషం: ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్య విజ‌యం సాధిస్తారు. స‌మ‌యాన్ని స‌రిగ్గా వాడుకుంటారు. స్నేహితుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృష‌భం: ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో ఆలోచించి జాగ్ర‌త్త‌గా అడుగువేయాలి. ముఖ్య‌మైన ప‌నుల్లో మీ తెలివిని ప్ర‌ద‌ర్శించి, అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు పొందుతారు. ఈ రాశి వారు దుర్గా ధ్యానం చేస్తే మంచిది. మిథునం: ఈ రాశివారు ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా మ‌నోధైర్యంతో ముందుకు సాగుతారు. […]

  • Publish Date - July 7, 2023 / 01:14 AM IST

Horoscope |

మేషం: ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్య విజ‌యం సాధిస్తారు. స‌మ‌యాన్ని స‌రిగ్గా వాడుకుంటారు. స్నేహితుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి.

వృష‌భం: ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో ఆలోచించి జాగ్ర‌త్త‌గా అడుగువేయాలి. ముఖ్య‌మైన ప‌నుల్లో మీ తెలివిని ప్ర‌ద‌ర్శించి, అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు పొందుతారు. ఈ రాశి వారు దుర్గా ధ్యానం చేస్తే మంచిది.

మిథునం: ఈ రాశివారు ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా మ‌నోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో ప‌నులు సులువుగా పూర్తి చేస్తారు. నూత‌న ఆలోచ‌న‌ల‌తో స‌త్ఫ‌లితాల‌ను సాధిస్తారు.

క‌ర్కాట‌కం: ఈ రాశివారికి ఆదాయానికి త‌గ్గ‌ట్టే ఖ‌ర్చు ఉంటుంది. బుద్ధ‌బ‌లంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఆత్మ‌స్థైర్యంతో విజ‌యాన్ని అందుకుంటారు. స‌మ‌యానికి నిద్రాహారాలు త‌ప్ప‌నిస‌రి.

సింహం: తోటి వారి స‌హాయంతో ప‌నులు పూర్తి చేస్తారు. క‌ష్ట‌సుఖాలు ఉంటాయి. ఎవ‌ర్నీ న‌మ్మి డ‌బ్బు ఇవ్వ‌రాదు. అస్థిర బుద్ధి వ‌ల్ల ప్ర‌ణాళిక‌లోపం ఏర్ప‌డుతుంది.

క‌న్య: ఈ రాశివారు మాట విలువ‌ను కాపాడుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బాధ్య‌త‌లు పెరుగుతాయి. నూత‌నోత్సాహంతో విజ‌యం సాధిస్తారు.

తుల: ఈ రాశివారికి ఏకాగ్ర‌త‌, ప‌ట్టుద‌ల మిక్కిలి అవ‌స‌రం. మాట్లాడే ముందు ఒక‌ట్రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

వృశ్చికం: వ్యాపారులు ఆచితూచి పెట్టుబ‌డులు పెట్టాలి. స‌మ‌యాన్ని స‌రిగ్గా వినియోగించుకుంటారు. ఊహించ‌ని ఫ‌లితాలు వ‌స్తాయి. ముఖ్య‌మైన ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు.

ధ‌నుస్సు: మీరు చేసే ప‌నుల్లో శుభ ఫ‌లితాలు ఉన్నాయి. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల దూర్చ‌కుండా ఉండ‌టం మంచిది. కుటుంబ స‌భ్యుల స‌హాయంతో ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. ఆశించిన ఫ‌లితాలు ఉన్నాయి.

మ‌క‌రం: ఈ రాశివారు నిరంత‌ర కృషి, ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతారు. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంది. ఆదాయానికి త‌గ్గ ఖ‌ర్చు ఉంటుంది. ఉద్యోగ‌, వ్యాపార విష‌యాల్లో శ్ర‌ద్ధ అవ‌స‌రం.

కుంభం: ఈ రాశివారికి ధ‌న‌లాభం ఉంది. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ‌వార్త ఆనందాన్ని ఇచ్చేలా ఉంటుంది. మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు.

మీనం: విజ‌యం వైపు న‌డుస్తారు. ప‌నులు చ‌క‌చ‌కా పూర్త‌వుతాయి. ఆవేశం ప‌నికిరాదు. ప్ర‌శాంతంగా ఉంటే చ‌క్క‌టి పురోగ‌తి ఉంటుంది. శ‌త్రువుల‌కు దూరంగా ఉండాలి.

Latest News