Site icon vidhaatha

Debit Card Charges | డెబిట్‌ కార్డుల చార్జీలు పెంచిన SBI.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి..

Debit Card Charges : ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుల నిర్వహణ ఛార్జీలను పెంచింది. అన్ని కార్డులపై గరిష్ఠంగా రూ.75 (జీఎస్‌టీ అదనం) వరకు చార్జీలు పెరగనున్నాయి. పెంచిన చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది.


ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ కార్డుల ఛార్జీలను రూ.200 చేసింది. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జి ఉండగా.. అది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250 కి పెరగనుంది. అలాగే ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది.


అదేవిధంగా ప్రైడ్‌, ప్రీమియం, బిజినెస్‌ కార్డులపై ఎస్బీఐ ప్రస్తుతం రూ.350 వార్షిక మెయింటెనెన్స్‌ ఛార్జీలను వసూలు చేస్తున్నది. ఇప్పుడు దీన్ని రూ.425కు పెంచింది. అంతేకాదు ఈ కొత్త చార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనంగా వసూలు చేయనున్నారు. 

Exit mobile version