Site icon vidhaatha

బీఆర్ఎస్ రజతోత్సవ సభపై 21న నిర్ణయం : హైకోర్టు

Telangana High Court : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభ అనుమతులపై నిర్ణయాన్ని 21వ తేదీన వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఎల్కతుర్తి సభ అనుమతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు‌ను ఆశ్రయించింది. ఎల్కతుర్తి సభకు అనుమతించేలా పోలీసులను ఆదేశాంచాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు శుక్రవారం విచారించింది. సభపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో తెలపాలని వరంగల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 17 లోగా అభ్యంతరాలపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలచ్చింది. ఒక వేళ పోలీసులు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోతే.. 21వ తేదీన వాయిదాలో సభకు అనుమతి ఇస్తామని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. జనసమీకరణకు ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ రంగంలోకి దించారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన 3వేల ఆర్టీసీ బస్సులకు సైతం రూ.8కోట్లను బీఆర్ఎస్ చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో సభకు అనుమతులివ్వకుండా అడ్డుకుంటే కోర్టు నుంచి అనుమతులను పొందేందుకు బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

Exit mobile version