Site icon vidhaatha

Delhi Liquor Policy | కేజ్రీవాల్‌ను 9 గంట‌ల పాటు విచారించిన సీబీఐ

Delhi Liquor Policy | ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సీబీఐ విచార‌ణ ముగిసింది. దాదాపు తొమ్మిది గంట‌ల పాటు కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాత్రి విచార‌ణ ముగిసిన అనంత‌రం సీబీఐ ఆఫీసు నుంచి నేరుగా త‌న ఇంటికి కాన్వాయ్‌లో వెళ్లారు కేజ్రీవాల్. సీబీఐ ప్ర‌ధాన కార్యాలయం వ‌ద్ద‌కు చేరుకున్న ఆప్ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు కేజ్రీవాల్ అభివాదం చేశారు.

అయితే కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయ‌డాన్ని నిర‌సిస్తూ పార్టీ శ్రేణులు నిర‌స‌న‌ల‌కు దిగారు. దీంతో సీబీఐ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఆప్ ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎంపీలు సంజ‌య్ సింగ్, రాఘ‌వ్ చ‌ద్దా, మంత్రులు సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, అతిషీ, కైలాష్ గెహ్లాట్‌, ఆప్ అధికార ప్ర‌తినిధి అదిల్ అహ్మ‌ద్ ఖాన్‌, ఆప్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంక‌జ్ గుప్తాతో పాటు ప‌లువురు పంజాబ్ మంత్రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version