Site icon vidhaatha

Kejriwal | CBI ముందుకు ఢిల్లీ సీఎం.. ఈ ప్ర‌పంచంలో నిజాయితీప‌రుడు ఎవ‌రూ ఉండ‌రు: కేజ్రీవాల్

Kejriwal |

విధాత: ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కేజ్రీవాల్‌కు సీబీఐ అధికారులు సూచించగా విచారణలో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ ఆదివారం CBI కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం సీబీఐ విచారణకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఓ వీడియో విడుద‌ల చేశారు. తాను అవినీతిప‌రుడిన‌ని బీజేపీ అనుకుంటుంది. తాను గ‌తంలో ఆదాయ‌పు శాఖ‌లో ప‌ని చేశాను. క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేసిన‌ప్పుడు కావాల‌నుకుంటే కోట్ల రూపాయాలు సంపాదించి ఉండేవాడినని అన్నారు.

CBI ఒకసారి కాదు వంద సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెబుతానన్నారు. CBI అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడైతే ఈ ప్రపంచంలో నిజాయితీ పరుడు ఎవరూ ఉండర‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.

సీబీఐ విచార‌ణ‌కు త‌ప్ప‌కుండా వెళ్తాను. వారు చాలా శ‌క్తివంతులు.. ఎవ‌రినైనా జైలుకు పంప‌గ‌ల‌రు. త‌న‌ను అరెస్టు చేయాల‌ని బీజేపీ ఆదేశిస్తే.. సీబీఐ త‌ప్ప‌కుండా త‌న‌ను అరెస్టు చేస్తుంది. బీజేపీ సూచ‌న‌ల‌ను సీబీఐ త‌ప్ప‌కుండా పాటిస్తుంద‌ని కేజ్రీవాల్ వీడియోలో పేర్కొన్నారు.

అయితే.. ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ సమన్లు జారీచేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ నిన్న మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని తేల్చిచెప్పారు. తనకు లిక్కర్ కేసులో CBI విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

CBI, ఈడీలు BJP చెబుతున్నట్లుగా చేస్తున్నాయని ఆరోపించారు. వాటిపై తాను కోర్టులో కేసు వేస్తానన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని ఆయన పూర్తి పారదర్శకమైనదని గేమ్ చేంజర్ అంటూ సమర్ధించు కున్నారు రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కెందుకే మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో మేము 100 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపించారని, ఆ డబ్బు ఎక్కడుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తాను మోడీకి వెయ్యికోట్లు ఇచ్చానని ఏ ఆధారం లేకుండా చెబితే ఆయనను CBI ,ఈడి అరెస్టు చేస్తుందా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాల్లో అబద్ధాలు చెప్తున్నాయని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి నా పేరును, సిసోడియా పేరును చెప్పాలంటూ హింసిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను అసాధారణ రీతిలో వినియోగిస్తున్న దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను BJP ఖండిస్తూ CBI సమన్లతో ఆయన వణికి పోతున్నారని, దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడాలని సవాల్ విసిరింది.

Exit mobile version