- క్రికెట్ తప్ప అన్నీ మాట్లాడుకున్నాం..
- ధోనీతో టీమ్ ఇండియా క్రికెటర్ల చిట్‌చాట్
రాంచి: భారత క్రికెట్‌లో ధోనీ ముద్ర చెరిపేయలేం. కూల్ అండ్ కామ్ గోయింగ్ తో ధోనీ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. జట్టు సభ్యులతో అద్భుతమైన రిలేషన్ మెయింటెన్ చేయడంలో ధోనీ స్టైల్ వేరు.
మైదానం వెలుపలా అతను పూర్తి కేరింగ్ తో ఉండడం తెలిసిందే. తాజాగా ధోనీ సొంత రాష్ట్రంలో టీ20 మ్యాచ్ ఆడేందుకు వచ్చిన టీమ్ ఇండియా సభ్యులను ధోనీ కలుసుకున్నాడు. దీంతో యంగ్ ఇండియా జట్టులో ఉత్సాహం పరవళ్లు తొక్కింది.
ఈ సందర్భంగా ధోనీతో ఏం మాట్లాడారు అన్న ప్రశ్నకు ..క్రికెట్ తప్ప అన్నీ మాట్లాడుకున్నాం. ధోనీతో క్రికెట్ గురించి మైదానంలో చాలా మాట్లాడాం.. ఇప్పుడన్నీ క్రికెటేతర విషయాలే మాట్లాడాం అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు.