విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా విద్యాధికారి రాజేష్ ఓ ప్రేవెట్ పాఠశాల అప్ గ్రేడ్ కోసం పాఠశాల యాజమాన్యం నుంచి 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
డీఈవోతో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ ఏసీబీకి దొరికినట్లు తెలుస్తోంది. ప్రైవేటు స్కూల్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు జిల్లా విద్యాధికారి రాజేష్ లంచం డిమాండ్ చేయడంతో సదరు పాఠశాల నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Siddipeta | వివాహితతో విద్యార్థి వివాహేతర సంబంధం.. తట్టుకోలేక ఆత్మహత్య