Tamil Hero Vijay |
రీసెంట్‌గా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ మంచి హిట్టు సినిమాని తన ఖాతాలో వేసుకున్నట్టే. రజనీ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్న ఈ సందర్భంలో నెల్సన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తను ఇంతకు ముందు చేసిన ‘బీస్ట్’ హీరో విజయ్ గురించి మాట్లాడారు.
ప్రస్తుతం రజనీ, విజయ్ ఫ్యాన్స్ మధ్య తమిళ నాట పెద్ద వారే జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్సన్ ఇంతకుముందు ఇళయదళపతి విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ అనే సినిమా కమర్షియల్ సక్సెస్ అయినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ వచ్చినా.. క్రిటిక్స్, ప్రేక్షకులు మాత్రం డివైడ్ టాక్‌తో ఆ సినిమా ఫెయిల్ అయినట్లుగానే తేల్చేశారు. ఆ టాక్ గురించి విజయ్‌తో నెల్సన్ మాట్లాడిని మాటలని నెల్సన్ తన తాజా ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు.
నేను విజయ్‌ని కలిసి ‘బీస్ట్’ సినిమా డివైడ్ టాక్ గురించి ఏదయినా బాధగా ఉందా? అని అడిగాను. దానికి తను బదులుగా ఏమన్నారో నాకింకా గుర్తుంది. నువ్వు ఏదయితే కథని స్ర్కీన్ పైన చూయించాలనుకున్నావో అది మనం చేశాం. మన పని మనం మనస్ఫూర్తిగా నిర్వర్తించి సినిమా తీశాం. కొందరికి నచ్చితే, ఇంకొందరికి ఆ సినిమా నచ్చలేదు.
అయినా నాకు బాధగా లేదు. మనం తీయాలనుకున్న సినిమాని తీశాం.. అంతే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తరువాత మళ్లీ నాకు ఫోన్ చేసి ‘అయినా నువ్వు అలా అడగడం అయితే నాకు బాధేసింది. సినిమా సక్సెస్-ఫెయిల్యూర్ లకు మాత్రమే పరిమితమయ్యే సాన్నిహిత్యం కాదు మనది. అలా ఎప్పుడూ అనుకోకు’ అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించింది.
ఒకవైపు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా.. ‘జైలర్’ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతూ నెల్సన్‌ని చూసి గర్వపడుతున్నట్లుగా ఇటీవల విజయ్ చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరి మధ్య ఇలాంటి సంబంధం ఉంది అని తెలియక.. చాలా మంది చాలా రకాలుగా వార్తలను వండుతున్నారు. అయినా, ఈ ఫ్యాన్స్ వార్ అనేవి ఎప్పుడూ మాములే. హిట్, ఫ్లాప్స్ అనేవి కూడా కామనే.
ఇప్పుడు రజనీకాంత్‌కి హిట్టొచ్చింది. రేపు విజయ్ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావచ్చు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అవుతున్నాయి. రజనీకాంత్‌కి హిట్ వచ్చి కూడా దాదాపు 10 ఏళ్లు అవుతుంది. అవన్నీ చూసుకోకుండా.. వాళ్ల హీరోలని వాళ్లే తక్కువ చేసి మాట్లాడుకోవడం ఏమిటో.. ఆ తంబీలకే తెలియాలి.