విధాత: పులి.. ఆ పేరులోనే గాంభీర్యం ఉంది. ఆ పేరు వింటేనే అటు జంతువులు, ఇటు మనషులు హడలిపోతారు. పులి కనిపించగానే మిగతా జంతువులన్నీ తోక ముడుచుకుంటాయి. దాని దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెడుతాయి. మరి అలాంటి పెద్ద పులిపైనే ఓ కుక్క దాడి చేయడం ఏంటని అనుకుంటున్నారా? కుక్క నిజంగానే పులిపై దాడి చేసింది.
ఓ జూపార్కులో పులి, సింహం, కుక్కను ఒకే ప్రాంతంలో ఉంచారు. అయితే పులిపై కుక్క దాడి చేసింది. పులి చెవిని తన నోటితో కుక్క పట్టుకుని హింసించింది. పులి ముఖంపై కూడా కుక్క రక్కింది. అయినప్పటికీ ఆ పులి మాత్రం సహనంతో ఉండిపోయింది.
పక్కనే ఉన్న సింహం కూడా అలాగే చూస్తుండిపోయింది. పులి, సింహం.. కుక్కకు ఎలాంటి హానీ కలిగించలేదు. ఎనిమల్ పవర్ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో ఈ వీడియో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 4.6 లక్షల మంది ఈ వీడియోను వీక్షించగా, 18 వేల మంది లైక్ చేశారు.