Site icon vidhaatha

Earthquake | గుజ‌రాత్‌లోని క‌చ్‌ జిల్లాలో భూకంపంa

Earthquake | విధాత‌: గుజ‌రాత్‌లోని క‌చ్‌ జిల్లాలో గురువారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా న‌మోదైంది. గురువారం ఉద‌యం 8.06 గంట‌ల‌కు భూకంపం వ‌చ్చిన‌ట్టు జాతీయ సిస్మొలజీ సెంట‌ర్ (ఐసీఎస్) వెల్ల‌డించింది.


ఐసీఎస్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ల్యాటిట్యూడ్ 24.27, ల్యాంగిట్యూడ్ 70.21 మ‌ధ్య భూ ఉప‌రిత‌లం నుంచి 15 కిలోమీట‌ర్ల లోతున భూకేంద్ర కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన చిత్రాన్ని పోస్టు చేశారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం, ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ట్టు త‌మ‌కు సమాచారం అంద‌లేద‌ని ఐసీఎస్ తెలిపింది.


గుజ‌రాత్‌లోని కచ్ జిల్లా చాలా అధిక ప్రమాద‌మైన భూకంప జోన్‌లో ఉన్న‌ది. అక్క‌డ తక్కువ తీవ్రతతో ప్రకంపనలు తరచుగా వ‌స్తూ ఉంటాయి. 2001లో కచ్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం అనేక పట్టణాలు, గ్రామాలను ప్రభావితం చేసింది. సుమారు 13,800 మంది మరణించారు.1.67 లక్షల మంది వ‌ర‌కు గాయపడ్డారు.

Exit mobile version