Earthquake | జమ్మూ కశ్మీర్‌లో మరోసారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.6తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం తూర్పు కత్రా నుంచి 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం గురించినట్లు పేర్కొంది. ఉదయం 5.1 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు చెప్పింది. వేకువ జామున ప్రకంపనలు రావడంతో అందరూ ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉండడంతో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. భూకంపం కారణంగా జరిగిన నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇంతకు ముందు దోడా, కిష్త్వార్‌లలో భూకంపం సంభవించింది. జనవరి 9న రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు నమోదవగా.. జనవరి 1 నుంచి 9 వరకు మూడుసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. గురువారం కథువాలో విపత్తు వంటి విపత్కర పరిస్థితుల్లో చేపట్టాల్సిన రెస్క్యూపై చర్చ జరిగింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్ తదితర సంబంధిత శాఖల అధికారులతో డీసీ రాహుల్ పాండే సమావేశం నిర్వహించారు. భూకంపాలు, వరదలు వంటి పరిస్థితులలో జిల్లా విపత్తు నిర్వహణ సమయంలో రెస్క్యూ టీమ్‌లు తమ కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పునరావాసం, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన వ్యూహం చర్చించారు.