తెలంగాణ ఉద్యోగుల డీఏ విడుదలకు ఈసీ పర్మిషన్‌

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ డిఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన విజ్ఞప్తి మేరకు ఒక డిఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది

  • Publish Date - December 2, 2023 / 09:25 AM IST

విధాత : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ డిఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన విజ్ఞప్తి మేరకు ఒక డిఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి పోలింగ్ ముగిసిన నేపధ్యంలో డీఏ విడుదలకు ఈసీ అనుమతిచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరిన పెండింగ్ డీఏ, రైతుబంధు నిధుల విడుదల, ఆర్టీసీ ఉద్యోగులకు అపాయింటెడ్ డేట్ కోరుతూ ఆక్టోబర్ 20న రాసిన లేఖలో ప్రస్తుతం పెండింగ్ డీఏకు మాత్రమే అనుమతి లభించడం విశేషం.