Site icon vidhaatha

Edla Rahul Rao | కేటీఆర్‌కు బామ్మర్ధి షాక్‌

కాంగ్రెస్‌లో చేరిన కేటీఆర్ బామ్మర్ధి ఎడ్ల రాహుల్ రావు

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..పార్టీ నుంచి వరుసగా సాగుతున్న వలసల షాక్‌లతో తల్లడిల్లుతున్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ దఫా సొంత బామ్మర్ధి రూపంలో మరో షాక్ తగిలింది. కేటీఆర్ సతీమణి శైలిమ సోదరుడైన ఎడ్ల రాహుల్ రావు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో రాహుల్ రావు కాంగ్రెస్‌లో చేరగా, ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ సొంత బామ్మర్ధి కాంగ్రెస్‌లో చేరిన పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version