Site icon vidhaatha

మెదక్: పవన్‌పై దాడికి నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దగ్దం

విధాత, మెదక్ బ్యూరో: వరంగల్ పట్టణంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులు పవన్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ సురభి ద్వివేది అధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మెదక్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్భంగా సురభి ద్వివేది మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలపై పవన్ ప్రశ్నిచడం వల్లనే ఆయన బీఆర్ఎస్ పార్టీ గుండాలతో దాడి చేయించారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో ఎవరు ప్రశ్నించిన వారిపై ఇలాగే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దాడులకు ఎవరు భయపడరని, ఒక వేళ యువజన కాంగ్రెస్ శ్రేణులు తలచకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయట తిరగలేరన్నారు.

ప్రజా సమస్యలపై యువజన కాంగ్రెస్ నాయకులు పోరాడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు పలుపడుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దద్దమ్మలు ఇలాంటి పిరికిపంద చర్యలకు పలుపడుతున్నారని ఆరోపించారు. వెంటనే దోషులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ రాథోడ్, కైజర్, జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు రమేష్ గౌడ్, రియాజ్ అలీ, ప్రేమ్ కుమార్, నాని, మహేష్, అమిర్, అధిల్ మధుసూదన్ రెడ్డి, ఉదయ్, అజయ్, సుధాకర్, రాజు, దాన్సింగ్, కృష్ణ, శ్రీనివాస్, ఇతరులు పాల్గొన్నారు.

Exit mobile version