- సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇంట్లో నిద్రిస్తున్న జాగిలపు ఐలమ్మ (70) అనే వృద్ధ మహిళను హాత్య చేసి దోపిడికి పాల్పడిన సంఘటన వరంగల్ సిటీలోని సుందరయ్యనగర్‌లో గురువారం రాత్రి జరిగింది. సంఘటన స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించారు. నేరం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ పి. కరుణాకర్, క్రైమ్ డీసీపీ మురళీధర్, పరకాల ఏసీపీ శివరామయ్య,ఏనుమాముల ఇన్స్పెక్టర్ చేరాలు, సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ రమేష్‌తో పాటు క్లూస్ విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు.