విధాత: మిర్యాలగూడ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రం వద్ద సోమవారం మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ రెండు చెవుల్లో గోబి పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని దరఖాస్తులు స్వీకరణ పేరుతో మరోసారి ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నిజానికి అధికారులు ఎంత మందికి ఇళ్లు ఇస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారని, ఇంకా ఎంత మందికీ ఇవ్వబోతున్నారో వెల్లడించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ అంతా ఎన్నికల స్టంటుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పి.వెంకటేశం గౌడ్, నాగేశ్వరరావులున్నారు.