Site icon vidhaatha

Erpula Narottam | ‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తమ్

Erpula Narottam |

విధాత: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా మెదక్ ఉమ్మడి జిల్లా జహీరాబాద్ కు చెందిన ఏర్పుల నరోత్తమ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ఉత్వర్వులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినం దుకు సీఎం కేసీఆర్ కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

జహీరాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నరోత్తంను బుజ్జగించేందుకు ఈ పదవిని కట్టబెట్టారు. తాజటా మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు కేటాయించడంతో నారోత్తంకు ఈ పదవి లభించింది.

Exit mobile version