Site icon vidhaatha

పోటీ నుంచి త‌ప్పుకున్న 10 మంది ఇండిపెండెంట్లు..

విధాత: మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ వ‌ద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు మొద‌లు పెట్టారు. లేక లేక మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు త‌న మార్కును చూపించారు.

మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో ఉన్న 10 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను పోటీ నుంచి త‌ప్పించారు. ఉప ఎన్నిక‌లో భాగంగా చండూరు ప‌రిధిలోని 2, 3వ వార్డుల ఇంచార్జిగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన హామీ మేరకు తాము మునుగోడు ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే కాక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

https://fb.watch/gc2fk6vb_i/

మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉద్యమకారులు వివిధ ప్రాంతాల నుంచి పలు పార్టీలు సంస్థల ప్రతినిధులుగా పదిమంది యువకులు తమ నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలిచారు. వాళ్లంతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రంగంలోకి దిగారు.

నేరుగా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారు. వాళ్ల సమస్యలు విన్నారు. వారికి అండగా ఉంటామని, పార్టీ పరంగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌లతో కలిపించి వారికి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన హామీతో వారు ఎన్నికల భరి నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు.

అంతేగాక మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ మాత్రమే పని చేస్తుందని ఏనాటికైనా ఇంటి పార్టీగా టిఆర్ఎస్ మాత్రమే ముందు కూడా అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడుతుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.

అయితే తెలంగాణ అభివృద్ధికి బిజెపి అడ్డుపడుతూ స్వార్థపర రాజకీయాల కోసం ఎన్నికలను తెచ్చి ప్రజలను బలిపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తాము ప్రజా పరమైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పరమైన కొన్ని అంశాలను మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తెచ్చామని వాటిని వారు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు తాము ఎన్నికల బరు నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల బరిలో నుంచి త‌ప్పుకున్న‌ పదిమంది యువకులను అభినందించారు. ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ తాము ఇచ్చిన హామీల మేరకు వారు విరమించుకోవడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు. అంతేకాక వారు టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. త్వరలోనే వారిని కేసీఆర్, కేటీఆర్‌లతో కలిపించి మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

పోటీ నుంచి విరమించుకున్న అభ్యర్థుల వివరాలు:

  1. కేయూ జేఏసీ అధ్యక్షులు నీట్ వరంగల్ విద్యార్థి కౌన్సిల్ అధ్యక్షులు ఆంగోత్ వినోద్ కుమార్
  2. వార్డ్ మెంబర్ భూక్య సారయ్య
  3. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాలోత్ వెంకన్న
  4. ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి తేజావత్ రవీందర్
  5. గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ నరేందర్
  6. నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్చార్జి భూక్య బాలాజీ
  7. ప్రజాసేన పార్టీ అధ్యక్షులు బానోతు ప్రేమ్ లాల్
  8. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను భరత్
  9. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను తిరుపతి
  10. చందర్ విద్యార్ది నాయకులు
Exit mobile version