Site icon vidhaatha

కరెంటు కోతలు నిరసిస్తూ రోడ్ పై ట్రాక్టర్ ఉంచి రైతుల ధర్నా

విధాత, మెదక్ బ్యూరో: విద్యుత్ కోతలు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నoగునూర్ మండలంలోని ఖానాపూర్, అంక్సాపూర్, నాగరాజ్ పల్లి గ్రామాల చెందిన రైతులు ముండ్రాయి రహదారిపై ట్రాక్టర్ ఉంచి ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి సరిపడ విద్యుత్ రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ కోతల విషయమై అధికారులను అడిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి 12 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రైతులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపచేశారు.

Exit mobile version