Site icon vidhaatha

Nalgonda: రైతు రాజ్యమే BRS లక్ష్యం.. దేశానికి CM KCR నాయకత్వమే శరణ్యం: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: రైతు రాజ్యమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. నల్గొండ సహకార బ్యాంక్ చైర్మన్‌గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలక వర్గం శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రైతు రంగాన్ని పరిరక్షించేందుకే టిఆర్ఎస్ బిఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. హస్తిన కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కదిలించాయన్నారు. ఏ పని మొదలు పెట్టినా కేసీఆర్‌కు దార్శనికత ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ప్రపంచంలో ఎవరు పడనన్ని తిట్లు, చెప్పుకోలేని శాపనార్థాలు కేసీఆర్ ను వెంటాడాయన్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధించిన పట్టు వదలని విక్రమార్కుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అదే స్థైర్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు బయలు దేరారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి శరణ్యం అని అన్ని వర్గాలు గుర్తించాయన్నారు.

మానవీయ కోణంలోనే సరిహద్దు రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరా నియంత్రణకు మోడీ సర్కార్ మోకాలొడ్డుతున్నా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కుట్రలు కుతంత్రలను ఛేదించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. వ్యవసాయ రంగంలో నల్లగొండ జిల్లా అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు. కరువు జిల్లా గా ఘనతి కెక్కిన నల్లగొండ జిల్లాలో నేడు వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నాడు ఉద్యమం లో 2014, 2018 లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం రేపటి రోజున కుడా కేసీఆర్‌కు బాసటగా నిలుస్తురాని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి బ్యాంకు మూడేళ్లలో 900 కోట్ల నుంచి 2200 కోట్ల టర్నో వర్ ఎదిగి లాభాల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచేలా కృషిచేసిన చైర్మన్ మహేందర్ రెడ్డి సారధ్యంలోని పాలకవర్గాన్ని, అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు యన్.భాస్కర్ రావు, కార్పొరేషన్ చైర్మన్లు తిప్పన విజయ సింహా రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిసిఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల సమాఖ్య చైర్మన్ శ్రీకర్ రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, మోతె సోమిరెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version