Site icon vidhaatha

కరెంట్ కోతలపై రైతుల నిరసన.. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు

విధాత, నిజామాబాద్ : వ్యవసాయానికి కరెంటు కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పడ్కల్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. బుధవారం ఉదయం సబ్ స్టేషన్ కు రైతులు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఒక వైపు వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం ఆచరణలో కోత విధిస్తుందని రైతులు ఆరోపించారు. పడ్కల్ సబ్ స్టేషన్ పరిధిలో పడ్కల్ తో పాటు కేష్ పల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Exit mobile version