Site icon vidhaatha

Jr NTR | మహిళతో జూ.ఎన్టీఆర్‌ వివాహేతర బంధం అంటూ సినీ క్రిటిక్‌ సంచలన ట్వీట్‌..! ఇందులో వాస్తవం ఏంత..?

Jr NTR | టాలీవుడ్‌ అగ్రహీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకరు. తన దైన నటనతో తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారక్‌.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తనను తాను ఓ సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్‌ సంధూ ఎన్టీఆర్‌ గురించి ఓ సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్‌ చేశాడు.

ఎన్టీఆర్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. అయితే, ఉమైర్‌ సంధు గతంలో పలు హీరోలతో పాటు హీరోయిన్లపై పలు వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

తాజాగా ఎన్టీఆర్‌పై పోస్ట్‌ చేస్తూ.. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్య ఇటీవల మరో మహిళతో ఉండగా అతన్ని పట్టుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతని భార్య అతని ఫోన్‌ని చెక్ చేసింది. ఆ మహిళ గురించి ఆమెకు తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రతి నటుడికీ రహస్య వ్యవహారాలు జరుగుతున్నాయి’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేస్తూ తారక్‌ ఫొటోను షేర్‌ చేశాడు.

అయితే, ఇది చూసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఉమైర్‌ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం తారక్‌కు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమైర్‌ సంధు ఇటీవల బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అబార్షన్‌ చేయించుకుందని, ఆ సమయంలో హృతిక్‌ రోషన్‌తో డేటింగ్‌లో ఉందని ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అబార్షన్ తర్వాత కంగనా రనౌత్ సైకోలా, పిచ్చిదానిలా మారిందని.. ఈ కారణంతో ఆమె ఎంతోమంది సైకియాట్రిస్ట్‌లను కలవడంతో పాటు ఎన్నో థెరపీలను చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఎన్టీఆర్‌పై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం వార్తలో నిలిచేందుకు ఉమైర్‌ సంధు ఇలాంటి ట్వీట్లు చేస్తాడని పలువురు పేర్కొంటున్నారు. సెలబ్రెటీలకకు అడ్డగోలుగా అక్రమ సంబంధాలు అంటగడుతున్న ఉమైర్‌ సంధుపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Exit mobile version