Fire Accident | హైదరాబాద్(hydrabad)లో అగ్ని ప్రమాదాలు కొనసాగుతున్నాయి. డెక్కన్ మాల్(Deccan mal) నుంచి జరుగుతున్న వరుస సంఘటనలు హైదరాబాద్ వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్(Secunderabad) స్వప్న లోక్ కాంప్లెక్స్(swapna lok Complex)లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగి.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. భారీ ప్రమాదంతో భవనం చుట్టపక్కల భారీగా పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన భవనంలో పలువురు చిక్కుకుపోయినట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎంత మంది చిక్కుకుపోయారన్నది తెలియరాలేదు. మరో వైపు అధికారులు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు క్రేన్‌ను తెప్పించారు. పోలీసులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
ఆరుగురు మృతి
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఊపిరాడక ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది ఐదవ ఫ్లోర్‌లోని ఓ రూమ్‌లో స్పృహ లేకుండా ఉన్న ఆరుగురుని రెస్క్యూ టీం రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన ఆ ఆరుగురు (ప్రమీల, వెన్నెల, శ్రావణి ప్రశాంత్, త్రివేణి, శివ) మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన వారంతా 25 సంవత్సరాల లోపే ఉన్నట్టు సమాచారం