Site icon vidhaatha

నల్గొండ: FCI గౌడన్‌లో అగ్ని ప్రమాదం.. మూడు కోట్ల ఆస్తి నష్టం

విధాత: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ శివారులో FCI గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 5,68,851 గన్ని బ్యాగులు అగ్నికి ఆహుతి అయ్యాయి.

సుమారు రూ.మూడు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. ఘటన స్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకోగా, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.

Exit mobile version