Site icon vidhaatha

పటాన్‌చెరువులోని లియో ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

విధాత: సంగాడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గం జిన్నారం మండలం ఖాజిపల్లి పారిశ్రామిక వాడలోని లియో ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కార్మికులు పరిశ్రమ బయటకు పరుగులు తీశారు.

ఇప్పటి వరకు కార్మికులకు సంబందించి ఎవరికి ప్రమాదం సంభవించలేదని తెలస్తోంది. ప్రమాద సంఘటన స్థలానికి 4 ఫైరింజన్‌లు చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version