Site icon vidhaatha

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. డెకరేషన్‌ సామగ్రి గోదాంలో చెలరేగిన మంటలు..

హైదరాబాద్‌ : నగర వాసులను వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇటీవల డెక్కన్‌ స్పోర్ట్స్‌ మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మరిచిపోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకున్నది. తాజాగా భాగ్‌లింగంపల్లి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వీఎస్టీ ప్రధాన కూడలి సమీపంలో గోదాములో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.

శుభకార్యాలకు వినియోగించే డెకరేషన్‌ సామగ్రి గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

https://www.youtube.com/live/6JBwQSlVRzc?feature=share

మంటలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. అయితే ఈ గోదాము పరిసరాల్లో చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి. దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. భారీ మంటలకు గోదాం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అయితే, సంఘటన జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. గోదాంలో శుభకార్యాలకు వినియోగించే అలంకరణ సామగ్రిని ఇక్కడి నుంచి తరలిస్తారని స్థానికులు తెలిపారు. వరుస అగ్నిప్రమాదాలు నగర వాసులను కంటిమీద కనుకు లేకుండా చూస్తున్నాయి. ఇండ్ల మధ్యలో ఉన్న గోదాంలో శివారుకు తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version