Site icon vidhaatha

Weather | ఢిల్లీలో దట్టంగా పేరుకుపోయిన పొగమంచు.. విమానాల రాకపోకలపై ప్రభావం..!

Weather | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. ఫలితంగా దృశ్యమాన తగ్గింది. దాంతో ఇందిరాగాందీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలోనూ పొగమంచు కారణంగా భారీగా విమాన కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. అయితే, ఢిల్లీలో వాతావరణం తరుచుగా మారుతూ వస్తున్నది. పగటిపూట ఎండ దంచికొడుతుండగా.. ఉదయం, సాయంత్రం వేళ్లలో చల్లటి వాతావరణం జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం పగలు ఆకాశం నిర్మలంగా ఉంటుందని, సాయంత్రం, రాత్రి సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.


గరిష్ఠంగా డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 17 వరకుఉదయం తేలికపాటి పొగమంచు కొనసాగుతుందని.. 14న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటిపూట స్వల్పంగా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. శనివారం ఢిల్లీలో చలిగాలులు వీయగా ఆదివారం ఉదయం స్వల్పంగా పొగమంచు పేరుకుపోయింది.


ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చల్లగా ఉండగా.. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదైంది. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆదివారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. కనిష్ఠ ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలు కాగా.. సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదైంది. మంగేష్‌పూర్ ప్రాంతంలో శనివారం అత్యల్పంగా 21.2 డిగ్రీలుగా రికార్డయ్యింది.

Exit mobile version