కాంగ్రెస్ కండువాను ఉతికి ఆరెస్తా: మోత్కుపల్లి

సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

  • Publish Date - April 19, 2024 / 02:28 PM IST

ఫ్యూడలిస్టు పోకడలో సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ మంత్రి మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవర్నీ దగ్గరికి రానియ్యట్లేదని, నన్ను రమ్మని పిలిచి అపాయింట్మెంట్ ఉన్నా సరే ఆరు గంటలు కూర్చోబెట్టి కలవకుండా రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగోడు వీడిని ఇంత తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆని వాళ్ళు అనుకుంటున్నారని, కాంగ్రెస్ కండువాని కొంచం ఉతికి ఆరేద్దాం అనుకుంటున్నట్లుగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూడలిస్టు పోకడ పోతున్నాడని, ఇలాగైతే వచ్చిన అవకాశం పోతుందన్నారు. ఆరు నెలల్లోనే ఇంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడన్నారు. ఎవరో ఫాల్తూ గాని గురించి నష్టం వచ్చేదానిగురించి ఎందుకని టికెట్ ఇచ్చిన వారిని తీసేయండని అసంతృప్తి వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి మాల,మాదిగ వర్గానికి చెందిన వాడు కాదని, శ్రీహరి పుట్టకనే అనుమానాస్పదంగా ఉందని, మళ్ళీ అయన బిడ్డని పోటీలో పెట్టే శ్రీహరికి బుద్ధి వుండాలన్నారు.

కావ్యకి టికెట్ ఇచ్చాక కూడా కేసీఆర్ దగ్గర కోట్లాది రూపాయలు తీసుకొని పోయాడని, మాకు అటెండర్ పోస్ట్‌లు ఇచ్చి బానిసత్వం చేయమన్నట్టు వుందన్నారు. నల్లగొండ రాజకీయాల్లో నన్ను తిండి తిననియ్యలేదు, పండనియ్యలేదని, భువనగిరి టిక్కెట్ నాకు ఇవ్వొచ్చు కదా, నాకంటే మొనగొడు ఎవడు వున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని పంచుకోవడంలో నల్లగొండ కుటుంబాలు మొదట వున్నాయని, సామాజిక న్యాయం చేసే దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్నింట్లో ఫెయిల్ అవుతారన్నారు.

Latest News