Site icon vidhaatha

సీఎంను కలసిన మాజీ ఎమ్మెల్యే మధ‌న్ రెడ్డి


విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మధ‌న్ రెడ్డి, బీఆరెస్‌ పార్టీ గజ్వేల్ నియోజక వర్గ సీనియర్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ మారనున్నారు.


ఈ మేర‌కు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అవుల రాజీ రెడ్డి అధ్వర్యంలో సీంఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో హత్నూర్ జ‌డ్పీటీసీ ఆంజనేయులు, కౌడిపల్లి మాజీ ఎంపీపీ భర్త నరసింహారెడ్డి, అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ సొసైటీ చైర్మన్ చిన్నంరెడ్డి, కంచనపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు సీఎంను కలిశారు. త్వ‌ర‌లోనే వీరంతా కాంగ్రెస్ గూటికి చేర‌కునేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ముహుర్తం ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

Exit mobile version