Site icon vidhaatha

మల్లారెడ్డి కుంభకోణాలన్నింటికి సాక్ష్యాలున్నాయి: మైనంపల్లి


విధాత: మల్లారెడ్డి భూకబ్జాలపై కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి 100 ఎకరాలు స్వాహా చేశాడని, మైనంపల్లి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే..మేమే దండ వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తామన్నారు. మల్లారెడ్డి భూకుంభకోణాలన్నింటికీ నా దగ్గర సాక్ష్యాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలు స్వతహగా బయటపెడితే ప్రజలే మల్లారెడ్డికి భజన చేస్తారన్నారు. రాష్ట అప్పులలో మీరు, మీ పార్టీ నాయకులు దోచుకున్నది ఎంతనో మల్లారెడ్డి చెప్పాలని నిలదీశారు.


సబ్జెక్ట్‌ లేకుండా మల్లారెడ్డి మాట్లాడుతున్నాడని, మల్లారెడ్డి ఏం మాట్లాడినా గత బీఆరెస్‌ ప్రభుత్వంలో నడిచిందని, ఇప్పుడు కుదరదని స్పష్టం చేశారు. తిరుమలగిరిలోని పురాతన ఆలయ భూములను మల్లారెడ్డి శిష్యుడు స్వాహా చేసే యత్నం చేశాడన్నారు. ఎన్నికలకు ముందు గిరిజనుల భూముల కబ్జాలను చేశాడని, కబ్జాలు, అధికార దుర్వినియోగంతో అడ్డగోలుగా సంపాదించి ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవడం అలవాటుగా మార్చుకున్నాడని, నాకు ఎన్నికల్లో డబ్బులు పంచే అలవాటు లేదని, ఐదేళ్లు సొంత ఖర్చులతో సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తానని, అలాగే ప్రజాభిమానం సంపాదించానని, మల్లారెడ్డి వచ్చాకా ఎన్నికలను డబ్బుల మయం చేశాడని విమర్శించారు. ఇకమీదట మల్లారెడ్డి ఆటలు సాగనివ్వబోమని, బిడ్డ నిన్ను మళ్లా పాలు అమ్ముకునేలా చేస్తానని హెచ్చరించారు.

Exit mobile version