Site icon vidhaatha

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీ గవర్నర్‌గా సుప్రీంకోర్టు రిటైర్ట్‌ జడ్జి అబ్దుల్‌ నజీర్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ చేసిన కేంద్రం.. ఆయన స్థానంలో స్థానంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (Justice s abdul nazeer) ను నియమించింది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేశారు. ఆయన అయోధ్య తీర్పు వెలువరించిన ఐదు జడ్జిల్లో ఆయన ఒకరు. అలాగే మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌, మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్‌ బైస్, నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్‌ను నియమించింది.

హిమాచల్‌ ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌ గా త్రివిక్రమ్ పట్నాయక్, మణిపూర్ గవర్నర్‌గా అనసూయ, బీహార్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్, సిక్కీం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అసోం గవర్నర్‌గా గులాబీ చంద్‌ కటారియా, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, లద్దాఖ్‌ ఎల్‌జీగా మిశ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, మహారాష్ట్ర, లద్దాఖ్‌ లెఫ్టినెంటర్‌ గవర్నర్లు భగవంత్‌ కోష్యారి, రాధాకృష్ణన్‌ మాథూర్‌ రాజీనామాలు చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు కేందం కొత్త గవర్నర్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక

తెలుగు రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగాలు..

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కొత్త గవర్నర్లు రానున్నట్లు ప్రచారం జరిగింది. ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే, జగన్‌ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా గవర్నర్‌ను మార్చడంలో ఏదైనా మార్చడంలో ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న బిశ్వభూషణ్‌ బదిలీపై ఛత్తీస్‌గఢ్‌కు పంపిన కేంద్రం.. ఆయన స్థానంలో ఏపీకి అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది. ఈ ఏడాది చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గవర్నర్ల మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే తెలంగాణలోనూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను సైతం బదిలీ చేయనున్నారని ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌ మార్చలేదు. దీంతో ప్రచారం వట్టిదేనని తేలింది.

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రస్థానం..

ఏపీ కొత్త గవర్నర్‌గా నియామకమైన అబ్దుల్‌ నజీర్‌ 1955 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో ఆయన జన్మించారు. మంగళూరులో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2017లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సైతం ఉన్నారు. అలాగే అయోధ్య రామభూమి కేసు తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లోనూ ఒకరు.

Exit mobile version