Site icon vidhaatha

యూత్ కాంగ్రెస్ పవన్‌పైన దాడి కేసులో నలుగురు అరెస్ట్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై సోమవారం రాత్రి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటనలో నలుగురు వ్యక్తులను మంగళవారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి హనుమకొండ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత రాత్రి హనుమకొండలో చేపట్టిన యాత్ర ముగిసిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టి దాడి పాల్పడిన నిందితులను గుర్తించారు.

నలుగురు నిందితుల అరెస్ట్

పవన్ పైన దాడికి పాల్పడిన వారిలో నలుగురు నిందితులు 1. చెక్క సుమన్, 2.రావుల కొలను నరేందర్, 3. గుడికందుల వినోద్ కుమార్, 4. సిటిమోర్ సునార్ కృష్ణలను అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో సంబంధం వున్న మిగతా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని హనుమకొండ ఇన్స్‌స్పెక్టర్ వెల్లడించారు.

Exit mobile version