Site icon vidhaatha

Gaddar | పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు గద్దర్ సంఘీభావం

విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు మోదిపురం వద్ద ప్రజా పార్టీ అధ్యక్షుడు గద్దర్ (Gaddar) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రజల యాత్రగా సాగుతుందన్నారు. భట్టి దానికి నాయకత్వం వహిస్తున్నారాన్నారు.

ప్రజల కోసం కొనసాగే యాత్రలకు.. ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాడే వారికి ప్రజా పార్టీ మద్దతునిస్తుందన్నరు. ప్రజల సమస్యలను భట్టి పాదయాత్ర వెలుగులోకి తెస్తుందని, ప్రజలకు భరోసానిస్తుందని, అధికారంలోకి వచ్చాక ఆయా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, చెవిటి వెంకన్నలు ఉన్నారు.

Exit mobile version