Site icon vidhaatha

Kavitha: హామీల అమలు బాధ్యత గాంధీ కుటుంబం తీసుకోవాలి: కవిత

Kavitha: ఎన్నికల హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ కుటుంబమే ఆ బాధ్యత తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై కవిత స్పందిస్తూ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని, గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావనే లేదన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు.

అందుకే బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం ఎన్నికల హామీల అమలుపై తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. రూ. లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని కవిత మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీని విస్మరించిందన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వైఫల్యాలపై ఎండగడుతామని కవిత ప్రకటించారు.

Exit mobile version