Site icon vidhaatha

ఏమ్మా గీతామాధురి.. ఏంటీ అవతారం?

విధాత: మ‌న టాలీవుడ్‌‌లో లేదు గాని బాలీవుడ్, కోలీవుడ్‌లో సింగర్స్ కి కూడా నటించే అవకాశాలు లభిస్తుంటాయి. ముఖ్యంగా లేడీస్ సింగర్ కాస్త చూడ ముచ్చటగా ఉంటే వారికి సినిమా అవకాశాలు ఇచ్చి వారికి ఉన్న క్రేజ్‌ను దర్శకనిర్మాతలు సొమ్ము చేసుకోవాలనుకుంటారు.

కానీ తెలుగులో ఆ ట్రెండ్ చాలా తక్కువ. మన లేడీస్ సింగర్స్ పెద్దగా నటన వైపు మొగ్గు చూపరు. ఎందుకంటే అక్కడ గ్లామర్, ఎక్స్‌పోజింగ్ వంటివి ఉంటాయి. ఇక నటిగా ఉంటూనే సింగర్స్‌గా మారిన వారి సంగతి మరో ఎత్తు. ఉదాహరణకు మమతా మోహన్ దాస్, శృతిహాసన్, రాశి కన్నా వంటి పలువులు హీరోయిన్లు సింగర్స్‌‌గా కూడా రాణించారు.

ఇక విషయానికి వస్తే.. సింగర్ గీతామాధురి గురించి తెలియని వారు బయట పెద్దగా ఉండరు. ఈమె బయట కనిపించకపోయినా తన మధురమైన గొంతుతో పాడిన పలు హిట్ సాంగ్స్ రూపంలో రోజు ప్రేక్షకులకు కనిపిస్తూనే.. సారీ సారీ వినిపిస్తూనే ఉంటుంది. తను యాక్టర్ నందుని వివాహం చేసుకుంది. అది కూడా ప్రేమ వివాహం. పాప పుట్టాక క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోయింది.

పర్సనల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ లను బాగా బ్యాలెన్స్ చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం ఫ్యాన్స్, నెటిజన్లతో టచ్‌లో ఉంటుంది. వారితో లైవ్ చిట్ చాట్ చేస్తుంది. ఈ బ్యూటిఫుల్ సింగర్‌కి 1.5 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

రీసెంట్‌గా ఈమె గౌన్ లాంటి అవుట్ ఫిట్‌లో గ్లామర్ గా కనిపిస్తున్న పిక్స్‌ని షేర్ చేసింది. పెళ్లయ్యాక అందం మరింతగా పెరిగింది.. అందమైన గీతకి అందమైన గొంతు.. మీరు హీరోయిన్‌గా నటిస్తే చూడాలని ఉంది.. అంటూ ఫ్యాన్స్, ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గీతామాధురికి చెందిన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version