Site icon vidhaatha

Gold Rate | షాక్‌ ఇచ్చిన బంగారం..! వెండి మరింత పైపైకి..! నేడు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | బంగారం ప్రియులకు ఇది షాకింగ్‌ వార్త. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 పెరిగి రూ.55,150కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.160 వరకు పెరగ్గా తులం రూ.60,320 వద్ద కొనసాగుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,320 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,520 ఉండగా 24 క్యారెట్ల రూ.60,570కి పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,160కి చేరింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వెండి ధర కిలోకు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.77,400 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,400 వద్ద ట్రేడవుతున్నది.

Exit mobile version