Gold Price Today | బంగారం ప్రియులకు శుభవార్త. వరుసగా బంగారం ధర దిగివస్తున్నది. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది.
22 క్యారెట్ల తులం బంగారంపై రూ.70 తగ్గి.. రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.100 వరకు తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,150 ధర పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60వేలకు తగ్గింది. బెంగుళూరులో 22 క్యారెట్లు రూ.55 వేలు ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి రూ.60వేల వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60వేల ధర పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.500 పెరుగుదల నమోదైంది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.74వేలు పలుకుతున్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ ప్రస్తుతం గోల్డ్ రేటు ఔన్సుకు 1937 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.16 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.82.003 వద్దకు చేరింది.